ఎదిగే పిల్లల ఆరోగ్యం మీద పోషకాహార లోపం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మసూచి, డయేరియా, న్యూమోనియా, మలేరియా వ్యాధుల బారిన పడుతుంటారు. సరైన ఆహారం తీసుకోకపోతే రోగనిరోధక శక్తి లభించదు. మరి పిల్లల్లో సరైన ఎదుగుదల ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
పిల్లల ఎదుగుదలకు సమతుల ఆహారం చాలా అవసరం. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, విటమిన్లు, ప్రోటీన్లు తక్కువగా తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. తల్లిపాలు మానేసిన తర్వాత పిల్లలకు ఇచ్చే ఆహారంపై అవగాహన ఉండాలి. మంచి శక్తి వచ్చే ఆహారాన్ని తయారు చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు తినటం అలవాటు చేయాలి. నూనె పదార్థాలు అలవాటు చేయకూడదు. పీచు పదార్థాలు, సీజన్లో లభించే ఆహారపదార్థాలు తినిపించాలి.