ఆకుకూరలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి తెలుసుకుందాం

What to do if the Leafy Vegetables need to be stored for more days

0
130

మనలో చాలా మంది ఈ మధ్య ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే రోజూ మార్కెట్ కు వెళ్లి తీసుకురావడం కష్టం అని, వాటిని ఒకేసారి ఎక్కువగా తీసుకువచ్చి ఫ్రిజ్ లో పెడుతున్నారు. మరికొందరు వీటికి ఫాయిల్ ఫ్రిజ్ కవర్లు తెచ్చి అందులో స్టోర్ చేస్తున్నారు. మరికొందరు ఆకుకూరలు కట్ చేసి వాటిని స్టోర్ చేస్తున్నారు.

ఆకుకూరల్లో విటమిన్స్ ,మినరల్స్, ఫైబర్ ,ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చాలా పోషకాలు లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆకుకూరల్లో తోటకూర, గోంగూర,చుక్కకూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా మనం నిత్యం వాడుతూనే ఉంటాము. ఇక ఈ రెయినీ సీజన్లో వీటి వాడకం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మరి ఎక్కువగా ఈ ఆకుకూరలు కొంటే ఎలా స్టోర్ చేయాలి అనేది చూద్దాం.

మీరు ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిజ్ లో ఆకుకూరలు పెడుతున్నారా? ఇలా చేయకండి. మీరు వాటిని ముందు పేపర్లో పెట్టి ప్రిజ్లో పెట్టండి. ఇలా చేస్తే దానిలో ఉండే తేమ బయటకు పోదు. తాజాగా ఉంటాయి. ఇక ఆకుకూరలకు దగ్గరగా కూరగాయలు, పండ్లు అస్సలు పెట్టవద్దు. అయితే మూడు రోజుల కంటే ఎక్కువ ఏ ఆకుకూర నిలువ పెట్టద్దు అంటున్నారు నిపుణులు.