ఆషాడ అమావాస్య రోజు ఏం చేయాలి – ఈ దానం చేస్తే ఎంతో పుణ్యం

What to do on Ashada Amavasya day

0
106

ప్రతి నెల వచ్చే అమావాస్య, పూర్ణిమలకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. కొన్ని విశిష్ట పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఆషాడ మాసంలో కృష్ణ పక్షం, అమావాస్యను ఆషాడ అమావాస్య అంటారు. అయితే ఈ రోజుకి ఎంతో ప్రత్యేకత ఉంది. తమిళనాడు కేరళలో ఈరోజున పూజలు చేసి ఉపావాసం ఉంటారు. జూలై 9న ఈరోజు ఆషాడ అమావాస్య. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య ఆషాధి అమావాస్య లేదా హలహరి అమావాస్య అని కూడా పిలుస్తారు.

వ్యవసాయం చేసే ప్రతీ కుటుంబం కూడా ఈ రోజు పండుగలా చేసుకుంటారు. పంట బాగా పండాలని పొలాలు బాగోవాలని పూజలు చేస్తారు. నాగలి, వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల పెద్దల ఆత్మ శాంతిస్తుంది అని చెబుతారు. ఈరోజు ఏమి దానం చేసినా అవి పెద్దలకు చేరతాయి అని పండితులు చెబుతారు.

ఉదయం తలారా స్నానం చేసి దేవాలయానికి వెళ్లి రావిచెట్టుకు చెంబుడు నీరు పోసి పూజించాలి. ఆ తర్వాత ధాన్యం దానం చేస్తే ఎంతో మంచిది. ఈరోజు శివుడు, రావి చెట్టు, హనుమంతుడు, శని దేవుడికి పూజలు చేయడం మంచిది.