Reused Cooking Oil | వంట నూనె చాలా పిరియం అయిపోయింది. అంతేకాకుండా చూస్తూచూస్తూ దేన్నీ పారేయలేం కదా. అందుకే ఇళ్లలో చాలా మంది పూరీ, పకోడీ, గారెలు వంటి వంటకాలు చేసినప్పుడు మిగిలిన నూనెను పారబోయడానికి మనసురాక.. ఆ నూనెనే దోసెలు, కూరలు వండుకోవడానికి వినియోగిస్తుంటారు. ఇది దాదాపు ప్రతి ఇంట్లో జరిగే విషయమే. కానీ, నిపుణులు మాత్రం ఇది ఏమాత్రం మంచిది కాదని అంటున్నారు. ఇలా చేయడం చాలా హానికరమైన అలవాటని చెప్తున్నారు. మళ్ళీ వేడి చేసిన నూనె అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వివరిస్తున్నారు. ఒకసారి కాగిన నూనెను మళ్ళీ వేడి చేయడం వల్ల అందులో అనేక రసాయన మార్పులు జరుగుతాయి. ఆ నూనెను వినియోగించి వంటలు చేస్తే అవి విషపూరితంగా మారతాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.
నూనెను మళ్ళీమళ్ళీ వేడి చేస్తే అందులోని కొవ్వు పదార్థాలు హానికరమైన ట్రాన్స్‌ఫ్యాట్స్‌గా మారతాయి. అవి గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. ఇది గుండెపోటు, రక్తనాళాలాలను సంకోచించేలా చేస్తాయి. అంతేకాకుండా మన శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ పెరిగిన కణాలను దెబ్బతీస్తాయని, దీని ప్రభావం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా మళ్ళీ వేడి చేసిన నూనె వల్ల బీపీ కూడా అధికం అవుతుందని వివరిస్తున్నారు.
ఒకసారి వాడిన నూనెతో వంటలు చేస్తే అవి దుర్వాసన వస్తాయని, దాని వల్ల ఆహారం తినలేమని నిపుణులు చెప్తున్నారు. దాంతో పాటుగా నూనెలో ఉండే హానికరమైన రసాయనాలు ఆహారంలో కలిసిపోే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా మాంసాహారం వేసిన నూనెలో మరోసారి వండటం(Reused Cooking Oil) అత్యంత ప్రమాదకరమని అంటున్నారు.