సాధారణంగా మనం అనేక రకరకాల వస్తువులు అవసర నిమిత్తం వాడుతుంటాం. అందులో షేవింగ్ చేసుకునే రేజర్ ను ఉపయోగిస్తే బ్లేడ్ తప్పనిసరి ఉండాల్సిందే. అయితే మనం తరచుగా వాడే బ్లేడ్ లు అన్ని ఎప్పుడైనా పరిశీలించారా? అవన్నీ ఒకే పరిమాణంలో, ఆకారంలో ఎందుకుంటాయో ఆలోచించారా? మరి అందుకు గలా కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అసలు మొట్టమొదట బ్లేడ్ తయారు చేసిన సంస్థ జిల్లెట్ కాగా దాని వ్యవస్థాపకుడు కింగ్ క్యాప్ జిల్లెట్. అతను ఓ సహోద్యోగితో మొదటి బ్లేడ్ ను తయారు చేశారు. అప్పుడు జిల్లెట్ కు పేటెంట్ గడువు ఉంది. ఇక ఆ గడువు ముగిసిన తరువాత మిగతా కంపెనీలు బ్లేడ్ లు తయారు చేయడం మొదలుపెట్టారు. అయితే అప్పటివరకు ఉత్పత్తి చేసిన బ్లేడ్ లు రేజర్ లో అమర్చే విధంగా తయారు చేశారు.
ఆపై మిగతా కంపెనీలు కూడా ఆ రేజర్ కు సరిపోను అంటే అలాంటి ఆకారం గల బ్లేడ్ లను ఉత్పత్తి చేశారు. బ్లేడ్ షేవింగ్ కె కాదు ఇతరత్ర పనులకు వాడుతుంటారు. అందువల్ల త్వరగా విరిగిపోకుండా ఉండేలా చేశారు. సన్నని పలుచగా ఉండేలా దీన్ని రూపొందించగా మధ్యలో ఆకారం లేకుంటే విరిగిపోతుంది. అందుకే అన్ని కంపెనీలు బ్లేడ్ ను ఒకేవిధంగా తయారు చేస్తున్నాయి.