బట్టతల ఎందుకు వస్తుంది? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

0
125

సాధారణంగా మగవారిని వేధించే ప్రధాన సమస్యలలో ఒకటి బట్టతల. ఇటీవల ఈ సమస్య అందరిలో సాధారణమైపోయింది. జుట్టు రాలడం అనేక కారణాల వల్ల జరుగుతుంది. బట్టతల రావడంతో అందవిహీనంగా కనపడడంతో బయటకు రావడానికి నలుగురిలో కలవడానికి ఆలోచిస్తుంటారు. మరి బట్టతల ఎందుకు వస్తుంది? రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

బట్టతల రావడానికి ప్రధాన కారణం అధిక ఒత్తిడి, వైద్య పరిస్థితి, మందులు తీసుకోవడం లేదా పోషకాల కొరత కారణం అని వైద్యులు చెబుతున్నారు. దీనిని అరికట్టాలంటే పురుషులు తమ జుట్టు పట్ల శ్రద్ధ వహించాలంటున్నారు. జుట్టు దువ్వేటప్పుడు గట్టిగా లాగుతూ దువ్వకూడదట. జుట్టుకు వేడి నూనెను కూడా రాయకూడదంటున్నారు. ఎందుకంటే మీ జుట్టు రాలడం మొదలవడానికి ఇదే ప్రధాన కారణం అంటున్నారు. రబ్బరు బ్యాండ్‌లు, బారెట్‌లు, బ్రెయిడ్‌లను ఉపయోగిస్తే జుట్టుకు ఒత్తిడి పెరిగి రాలిపోతుందట.. కాబట్టి వాటిని దూరంగా ఉంటే మంచిదంటున్నారు.

నివారించడం ఇలా..

బట్టతలను నివారించుకోవాలంటే.. వారానికి రెండుసార్లు ఉల్లిపాయ జ్యూస్‌ను మాడుకు పట్టించాలి. రోజు మార్చి రోజు మాడుకు ఆనియన్ జ్యూస్‌ను పట్టించడం ద్వారా జుట్టు పెరుగుతుంది. ఇంకా జుట్టు రాలే సమస్య పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా మాడుకు అలోవెరా జెల్ పట్టించడం ద్వారా బట్టతల రాకుండా జాగ్రత్త పడవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.