గురక సమస్య అసలు ఎందుకు వస్తుంది ? దీనికి పరిష్కారం ఏమిటి

Why does the snoring problem occur

0
104

చాలా మందికి గురక సమస్య ఉంటుంది అయితే ఈ సమస్య ఎందుకు వస్తుందో కూడా చాలా మందికి తెలియదు.
గురక పెట్టే అలవాటు వల్ల వారికి ఏమాత్రం ఆ గురక గురించి తెలియదు. కాని పక్కన ఉన్న వారికి మాత్రం ఆ గురక వల్ల ఎంతో ఇబ్బంది ఉంటుంది. ఎదుటి వారికి నిద్రపట్టదు. అయితే గురక ఎందుకు వస్తుంది అనేది చూస్తే.

నిద్ర సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడితే అప్పుడు గురక వస్తుంది.
ఈ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. గాలి వెళ్లాల్సి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై చప్పుళ్లు వస్తాయి. అంతేకాదు మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచన వల్ల కూడా ఇలా గురక అనేది వస్తుంది. అనేక కారణాలు ఉంటాయి గురక రావడానికి అంటున్నారు నిపుణులు.

మహిళల్లో కంటే పురుషుల్లో గురక సమస్య ఎక్కువగా వస్తుంది. రాత్రి పడుకునే ముందు అటుకులు గుప్పెడు తీసుకోండి మీకు గురక సమస్య తగ్గుతుంది. గ్లాస్ వాటర్ లో రెండు పిప్పర్ మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి పడుకునే ముందు పుక్కిలించండి మీకు నిద్ర పడుతుంది గురక తగ్గుతుంది.

గమనిక – గురక ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యులని సంప్రదించడం మేలు . నిపుణుల సలహాతో ఈ చిట్కాలు ఫాలో అవ్వండి