హనుమాన్ దేవాలయాల్లో విగ్రహం సింధూరంలో కనిపిస్తుంది ఎందుకంటే

why hanuman idol have sinduram colour

0
90

హనుమాన్ దేవాలయాల్లో ఆయన విగ్రహం చూస్తే సింధూరంలో కనిపిస్తాయి. ఇక కచ్చితంగా స్వామి ఆలయానికి వెళితే ఆ సింధూరం మనం బొట్టుగా పెట్టుకుంటాం. మరి ఆ హనుమంతుడు ఆ సింధూరం ఎందుకు ఇలా రాసుకున్నారు అంటే పురాణాల్లో దీనికి సంబంధించి ఓ విషయం చెబుతారు.

ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడుగుతాడు హనుమంతుడు. అప్పుడు సీతాదేవి రాముడి ఆయుష్షు కోసం అని చెబుతుంది. వెంటనే రామ భక్తుడైన హనుమంతుడు జానకీరాముడి దీర్ఘాయుష్షు కోసం ఒళ్ళంతా సింధూరాన్ని పులుముకున్నాడట. అందుకే ఆయన విగ్రహాలు ఆలయాల్లో ఇలా సింధూరంతో ఉంటాయి.

ఇక పిల్లలకు పెద్దలకు ఏదైనా భయం కలిగినా ఆ స్వామిని నమస్కరించి ఆ సింధూరం తిలకంగా పెట్టుకుంటారు. ఇంట్లో భయాలు ఏమైనా ఉన్నా పోతాయి. ఇక స్వామిని తాకి అక్కడ కిరిటాన్ని ముట్టుకుని ఆ సింధూరం పెట్టుకుంటారు అందరూ.
ఇక ఈ సింధూరం స్వామికి సమర్పించి దానిని ఇంట్లో దేవుడి గూటిలో చిన్న భరిణిలో పెట్టుకుంటే ఇంటికి కూడా మంచిది.