మిరపకాయ తింటే ఆ ఘాటు ఎందుకు అంత వస్తుంది – వెంటనే మంట తగ్గాలంటే ఇలా చేయండి

why it's so intense when you eat chili

0
89

మిరపకాయలు ఎంత హాట్ గా ఉంటాయో తెలిసిందే. ఈ మిరప గింజలను చేతితో తాకినా మనకు హీట్ అనిపిస్తుంది. క్యాప్సైసిన్ మిరపకాయ గింజలలో కనిపిస్తుంది. చెప్పాలంటే మనం ఫీల్ అయ్యే ఘాటు కారం ఇదే కలిగిస్తుంది. మనం ఇది తిన్న వెంటనే క్యాప్సైసిన్ రక్తంలో సబ్స్టాన్స్ పి అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది.

ఇది మెదడులో మంట, వేడిని స్పందింపజేస్తుంది. అందుకే సెకన్ల వ్యవధిలో మనకు మంట కారం అని అంటూ ఉంటాం. అయితే నీటికి ఈ వేడి మంట తగ్గదు. దీనికి కారణం ఏమిటి అంటే ? క్యాప్సైసిన్ నీటిలో కరగదు మరి మంట ఘాటు తగ్గాలి అంటే ఏం చేయాలి అనేది చూద్దాం.

ఇలా నాలుకకి తగిలిన వెంటనే మంట అనిపిస్తే పాలు, పెరుగు, తేనె లేదా చక్కెరను ఉపయోగించాలి. గ్యాస్ మంట అసిడిటి కడుపు నొప్పి మలబద్దకం సమస్య ఉన్నవారు ఈ మిరప ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. అల్సర్ పైల్స్ సమస్యలు ఉన్నా మిర్చిఎక్కువగా తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు.