రాత్రి పూట మంగళవారం – శుక్రవారం గోళ్లు ఎందుకు కత్తిరించకూడదు

Why not cut nails on Friday and Tuesday at night time

0
108

మనం చాలా మందిని చూస్తు ఉంటాం రాత్రి సమయాల్లో అస్సలు గోళ్లు కత్తిరించుకోరు. అంతేకాదు శుక్రవారం మంగళవారం కూడా ఈ గోళ్లు కత్తిరించుకోరు. దీనికి కారణం చెబుతారు. ఈ రోజు గోళ్లు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి మన దగ్గర నిలవదు అని పెద్దల నుంచి చెబుతూనే ఉంటారు. ఒకవేళ ఎవరైనా పిల్లలు ఇలా రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవాలి అనుకున్నా వారిని పెద్దలు మందలిస్తారు.

అయితే దీని వెనుక కారణం పాత కాలంలో రాత్రి పూట చీకటిగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గోళ్లు కత్తిరించకూడదు అని చెప్పేవారు. ఆరోజుల్లో పదునైన వస్తువులు వాడి గోళ్లు తీసేవారు, రాత్రి దీపం వెలుగులో వేలు తెగే ప్రమాదం ఉంటుంది అందుకే రాత్రి పూట గోళ్లు కత్తిరించడం మానేశారు. ఇక శుక్రవారం మంగళవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆరోజు హెయిర్ కటింగ్ అలాగే గోళ్లు కత్తిరించుకోవద్దు అంటారు.

అయితే గోళ్లు కత్తిరించుకోవడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి అవి తెలుసకుందాం. గోళ్లను కత్తిరించడం ద్వారా చేతులు శుభ్రంగా ఉంటాయి. చేతులు శుభ్రంగా ఉంటే ఎలాంటి మట్టి చేరదు. మన నోటిలోకి క్రిములు వెళ్లడానికి గోళ్లు కూడా కారణం? అందుకే ఆ చేతులు గోళ్లు తరచూ శుభ్రం చేసుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు.