Sleepiness | సాధారణంగా నిద్ర లేకపోవడం చాలా మందిలో సమస్య. కానీ కొందరిలో మాత్రం అతి నిద్రే పెద్ద సమస్యగా ఉంటుంది. తొమ్మది పది గంటలు నిద్రపోయిన తర్వాత కూడా ఎప్పుడు చూసిన నిద్ర మంపుతోనే ఉంటారు. అది కూడా చాలా పెద్ద సమస్యే అంటున్నారు వైద్యులు. దీనినే హైపర్సోమ్నియా అంటారు. ఈ సమస్య ఉన్నవారికి ఎంత నిద్రపోయినా నిద్ర చాలినట్టు అనిపించదు. ఈ సమస్య ఉన్నవారికి మధ్యాహ్నం అయితే చాలా నిద్రాదేవత ఆవహించినట్లు అవుతుంది. ఎంత ప్రయత్నించినా నిద్ర ముంచుకొస్తుంటుంది. దీని వల్ల వాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆఖరికి వీరిలో ఏకాగ్రత లోపం కూడా అధికంగానే ఉంటుంది. అయితే దీనికి అనేక కారణాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు.
నార్కోలెప్సీ వల్ల కూడా ఇటువంటి సమస్యే తలెత్తుతుంది. ఈ రుగ్మత వల్ల సమయం, సందర్భం లేకుండా నిద్రమత్తులో జోగుతున్న భావన కలుగుతుంది. దీంతో పాటుగా స్లీప్ అప్నియా ఉన్నా ఇదే సమస్య తలెత్తుతుంది. ఇవే కాకుండా హైపోథైరాయిడిజం కూడా అధిక నిద్రకు కారణం కావొచ్చంటున్నా వైద్యులు. ఈ సమస్య వల్ల శరీరంలో తగినన్ని థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి కావాల్సిన స్థాయిలో జరగదు. దీని వల్ల శరీరంలో శక్తి తగ్గి ఎప్పడూ అలసటగా అనిపిస్తూంటుంది. రోజంతా కూడా నిద్రమత్తులో జోగులాడుతుంటారు. కొన్నికొన్ని ఔషదాల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా అతినిద్ర సమస్య తలెత్తొచ్చని వైద్యులు చెప్తున్నారు.
Sleepiness | మన జీవన శైలి, అలవాట్లు కూడా అతినిద్రకు కారణాలు కావొచ్చని వివరిస్తున్నారు వైద్యులు. రాత్రి సమయంలో సరైన రీతిలో నిద్ర లేకపోవడం, ప్రతి రోజూ ఒకే సమయంలో నిద్రించలేకపోవడం కూడా హైపర్ సోమ్నియాకు దారి కావొచ్చని అంటున్నారు. శరీరానికి సరిపడా పోషకాలు అందకపోవడం వల్ల, మద్యం, డ్రగ్స్ లేదా ఇతర మత్తుపదార్థాల వినియోగం కూడా నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుందని, అప్పుడు కూడా రోజంతా కూడా నిద్ర చాలని ఫీల్ ఉంటుంది. వీటితో పాటుగా మన జెనిటిక్స్ నుంచి కూడా ఇలాంటి సమస్యలు రావొచ్చని, సమస్య అధికంగా ఉంటే వైద్యులను సంప్రదించిన సరైన మెడికేషన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.