జపాన్ గురించి చెప్పాలంటే ఈ దేశంలో భార్య భర్తలు చాలా మంది ఇద్దరూ ఉద్యోగం చేస్తారు. అందుకే ఇద్దరికి వేరు వేరు పనిగంటలు ఉంటాయి . ఒకరు ఉదయం డ్యూటీకి వెళితే మరొకరు రాత్రి డ్యూటికి వెళతారు. ఇక ఇంట్లో ఉన్న వారు ఆ సమయంలో పిల్లలని చూసుకుంటారు. అయితే ఒకరి నిద్ర మరొకరు చెడగొట్టకూడదు అని ఇద్దరూ వేర్వేరు రూమ్స్ లో పడుకుంటారట.
దీని వల్ల శారీరక, మానసిక సమస్యలు ఉండవు అని వారు నమ్ముతారు. ఇక వారు పిల్లలతో పడుకుంటున్నారట. ఇలా చేయడం వల్ల పిల్లలతో చాలా ఆనందంగా ఉంటారు. అలాగే వీకెండ్ లో ఇంట్లో అందరూ కలిసి ఉంటారు పార్టీలకు అవుటింగ్ లకి వెళతారు. ఇలా వేరు వేరు రూమ్స్ లో పడుకోవడం వల్ల పిల్లలకు కూడా నిద్ర సమస్యలు రావు అని వారు నమ్ముతున్నారు.
దీని వల్ల ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదట, అయితే చాలా మంది వైద్యులు దీనిని సజెస్ట్ చేస్తున్నారు అక్కడ. ముఖ్యంగా ఐటీ మెకానికల్ టెక్ ఉద్యోగాల్లో కొందరు ఇదే ఫాలో అవుతున్నారట.