Weight Loss | శీతాకాలంలో బరువు తగ్గాలా.. వీటిని తినాల్సిందే..

-

Weight Loss | బరువు తగ్గాలంటే కొవ్వు కరగాలి. అది జరగాలంటే చెమట పట్టాలి. శరీరంలో ఎంత వేడి ఉత్పత్తి అయితే.. అంత కొవ్వు కరిగి మనం బరువు తగ్గడమే కాకుండా సన్నగా నాజుగ్గా తయారవుతాం. కానీ చలికాలంలో చెమట పట్టాలంటే అది పెద్ద ఛాలెంజ్‌లా ఉంటుంది. గంటల తరబడి కష్టపడినా చెమట పట్టదు. మరి అలాంటి సమయంలో బరువు తగ్గాలంటే కష్టమే. చలికాలంలో శారీరిక శ్రమ తగ్గడం, జీవక్రియలో మార్పులు, చలి వాతావరణం, తక్కువగా ఉండే పగలు, సౌకర్యవంతమైన ఆహారం తీసుకోవడం వల్ల సాధారణంగానే చలికాలంలో బరువు పెరుగుతుంటాం.

- Advertisement -

చలిగా ఉండటం వల్ల శారీరక కదలికలు మందగిస్తాయి. ఆ సమయంలో కామన్‌గానే శరీరం శక్తిని ఆదా చేస్తుంది. అధిక కేలరీలు, వేడిగా ఉండే ఆహారాలను తినాలన్న కోరిక పెరుగుతుంది. అంతేకాకుండా చలికాలం సూర్యరశ్మి కూడా మనకు ప్రతికూలంగా పనిచేస్తుంది. ఎండ మనలో ఉండే సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది అతిగా తినాలన్న కోరికలను అధికం చేస్తుంది. దీని వల్ల బరువు తగ్గాలని అనుకునే వారికి చలికాలం పెద్ద ఛాలెంజ్‌లా మారుతుంది.

కానీ కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా బరువును వేగంగా తగ్గొచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇందుకు ఎక్కడకో వెళ్లాల్సిన అవసరం లేదని, మన వంటింట్లో లభించే మసాలాలు చాలంటున్నారు. చలికాలంలో బరువు తగ్గడానికి మన వంటగదిలో ఉండే మసాలాలు దివ్యౌషధంలా పనిచేస్తాయిన చెప్తున్నారు. మరి ఆ మసాలాలు ఏంటో ఒకసారి చూసద్దామా..

దాల్చిన చెక్క: శరీరంలో ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడంలో దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. మన శరీరానికి వెచ్చదాన్ని అందించే గుణాలు దాల్చిన చెక్కలో పుష్కలంగా ఉన్నాయి. దాంతో పాటుగా మన జీర్ణ వ్యవస్థను కూడా ఇది మెరుగు పరుస్తుంది. పదేపదే ఆకలి వేయడాన్ని తగ్గిస్తుంది.

ఆకలి తగ్గడం వల్ల ఏది పడితే అది తినడాన్ని తగ్గించొచ్చు. ఫలితంగా బరువు తగ్గడంలో(Weight Loss) దాల్చిన చెక్క సహాయపడుతుంది. ఇందుకోసం ప్రతి రోజూ ఉదయం పూట పాలలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగాలి. అలా చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని వైద్యులు చెప్తున్నారు.

యాలుకలు: చలికాలంలో జీవక్రియలు మందగిస్తాయి. దాని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఫలితంగా బరువు పెరుగుతాం. అలా కాకుండా ఉండాలంటే ప్రతి రోజూ యాలుకలు తినాల్సిందే. ఉదయం పూట తాగే టీలో లేదా నేరుగానో యాలుకలను తినడం ద్వారా బరువు తగ్గొచ్చు. యాలుకలు మన జీర్ణశక్తిని పెంచడంలో సమర్ధంగా పనిచేస్తాయి. కాబట్టి యాలుకలను తప్పకుండా ప్రతి రోజూ ఆహారం ద్వారా కానీ నేరుగా కానీ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు.

ఎండు మిర్చి: మన ఆహారంలో ఎండు మిర్చిని యాడ్ చేసుకోవడం ద్వారా కూడా చలికాలంలో బరువును తగ్గించుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు. ఎండు మిర్చిలో ఉండే క్యాప్సెసిన్ అనే సమ్మేళనం శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తరచూ మన ఆహారంలో ఎండు మిర్చి ఉండేలా చూసుకోవడం ద్వారా అది మన జీవక్రియల్ని వేగవంతం చేస్తాయి. మన గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.

మిరియాలు: శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో మిరియాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే ఫైపెరిన్ అనే సమ్మేళనం కొవ్వును కరిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మందగించిన మన జీవక్రియలను వేగవంతం చేయడంలో కూడా మిరియాలు బాగా పనిచేస్తాయి.

ప్రతి రోజూ ఉదయాన్నే టీ లేదా పాలలో మిరియాల పొడి వేసుకుని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇవి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు దీర్ఘ కాలంలో స్థూలకాయం రాకుండా కూడా జాగ్రత్తపడొచ్చని నిపుణులు చెప్తున్నారు.

పసుపు: అవును మీరు విన్నది కరెక్టే పసుపు కూడా చలికాలంలో మన శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడానికి బాగా పనిచేస్తుంది. పసుపులో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-వైరల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు మందగించిన మన జీవక్రియను మెరుగుపరుస్తాయి. తద్వారా మన జీర్ణక్రియ వేగవంతమవుతుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు కరగుతుంది. ప్రతి రోజూ మన ఆహారంలో పసుపును వినియోగించడం ద్వారా అనేక ఆరోగ్య లాభాలు పొందొచ్చని వైద్యులు చెప్తున్నారు.

జీలకర్ర: దీర్ఖకాలంలో స్థూలకాయం బారిన పడకుండా ఉండటానికి జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసునీటిలో రాత్రి సమయంలో కొద్దిగా జీలకర్ర వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగేయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తే పరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది.

Read Also: శీతాకాలంలో నారింజ పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..!
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...