చలి కాలం వచ్చింది అంటే సీజన్ మారిన వెంటనే కొంత మందికి దగ్గు జలుబు వెంటనే స్టార్ట్ అవుతాయి, పొడి మంచు వల్ల చాలా మందికి ఉదయం లేవగానే ఈ సమస్య వేధిస్తుంది, అయితే ఎంత వేడి నీరు తాగినా వేడి నీరు స్నానం చేసినా చాలా మందికి ఇబ్బంది ఉంటుంది, అయితే ఈ సమయంలో ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలి అంటున్నారు వైద్యులు, పిల్లలకు ఈ జలుబు దగ్గు వస్తే తగ్గవు సో వారి కి కూడా కొన్ని రకాల ఫుడ్ ఇవ్వద్దు అని సలహా ఇస్తున్నారు.
గొంతు పట్టేయడం, జలుబు, ఫ్లూ, న్యుమోనియా, స్టమక్ ఫ్లూ, ఇయర్ ఇన్ఫెక్షన్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలాంటి సమస్యలు ఈ నవంబర్ నెల నుంచి ఫిబ్రవరి వరకూ వేధిస్తాయి, సో మీరు కచ్చితంగా ఈ ఫుడ్ తినకండి, ముఖ్యంగా కూల్ వాటర్ తీసుకోవద్దు, డ్రింకులు మానేయ్యండి, ఐస్ క్రీమ్ కి దూరంగా ఉండండి, ఇక ఐస్ క్యూబ్స్ ఐస్ మిల్క్ ఇలాంటి జ్యూస్ లు తాగద్దు.
కొవ్వు, నూనె, ఉప్పు అధికంగా ఉండే ఫుడ్ ప్రొడక్స్ట్ ని పిల్లలకు పెట్టకూడదు. ఇక తెల్లటి ఫుడ్ ఏదీ వద్దు మైదా, పంచదార, వైట్ సిరప్స్ తీయని డ్రింక్స్ , పన్నీర్ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి, ఈ సమయంలో మూడు నెలలు దాదాపు చాక్లెట్స్ కి దూరంగా ఉంటే చాలా మంచిది.