Winter Health Tips | శీతాకాల సమస్యలకు బెస్ట్ చిట్కాలు..!

-

Winter Health Tips |సీజన్ మారిందంటే అనేక సమస్యలు మన శరీరాన్ని చుట్టుముట్టేస్తాయి. ఎండాకాలం వస్తే సెగ్గడ్డలు, అధిక చెమట, డీహైడ్రేషన్ వంటివి, వర్షాకాలంలో వైరల్ ఫీవర్లు, జలుబు వంటి వస్తాయి. అదే విధంగా చలికాలం కూడా ఇటువంటి ఎన్నో సమస్యలను మనల్ని ఇబ్బంది పెడతాయి. శీతాకాలంలో పెరిగే చలి వల్ల మన పాదాల దగ్గర నుంచి జుట్టు వరకు దెబ్బతినే ప్రమాదం ఉంది. వాటి బారిన పడకుండా ఉండటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ చాలా ప్రయత్నాలు కోరుకున్న ఫలితాలను ఇవ్వవు. అయితే ఈ సమస్యలకు మన ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు ఉన్నాయని, వాటిని పాటిస్తే ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టొచ్చని అంటున్నారు నిపుణులు. వీటిలో చాలా సమస్యలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా తగ్గినట్టే తగ్గి మళ్ళీ పునరావృత్తం అవుతుంటాయి. అయితే వీటి నుంచి ఉపశమనం పొందాలంటే చిన్నచిన్న చిట్కాలు పాటిస్టే సరిపోతోందని అంటున్నారు నిపుణులు. అవేంటో ఒకసారి చుసేద్దాం..

- Advertisement -

పొడి చర్మం: శీతాకాలం అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది పొడిబారిన చర్మం. ప్రయాణాలు చేసే వారికైతే ఇదే అతిపెద్ద సమస్యగా కూడా ఉంటుంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే.. పెరుగు, మజ్జిగ కలిపి చర్మానికి బాగా పట్టించాలి. ఆ మిశ్రమం పూర్తిగా ఆరిపోయే వరకు ఉంచుకుని ఆ తర్వాత కడిగేసుకోవాలి.

Winter Health Tips | దీంతో పాటుగానే కలబంద గుజ్జుతో కూడా పొడి చర్మానికి బైబై చెప్పొచ్చంటున్నారు నిపుణులు. కాస్త కలబంద గుజ్జు ఒక బౌల్‌లో తీసుకోవాలి. అందులో ఒక చెంచా కాకరకాయ రసం తీసుకుని బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని మొఖానికి బాగా పట్టించి రాత్రంతా అంతే వదిలేయాలి. ఉదయాన్నే మొఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి కావాల్సిన తేమ లభించడంతో చలికాలంలో పొడిబారిన చర్మం సమస్యకు టాటా చెప్పొచ్చు.

పాదాల పగుళ్లు: పాదాల పగుళ్లు చలికాలం చాలా చికాకు పెట్టే విషయం. దీని కోసం అరటిపండు గుజ్జును తీసుకుని, పగుళ్లు ఉన్న ప్రాంతంలో రాయాలి. పది నిమిషాలు ఆగిన తర్వాత కడిగేసుకోవాలి. అదే విధంగా రాత్రి పడుకునే ముందు కాళ్లకు వంట నూనె రాసుకుని, సాక్స్ ధరించాలి. ఉదయాన్ని నిద్రలేచిన తర్వాత పాదాలను కడిగేసుకోవాలి. ఈ రెండు చేయడం వల్ల పాదాలు ఆరోగ్యంగా ఉంటాయని అంటున్నారు నిపుణులు.

పొడి జుట్టు: చలికి మన చర్మం, పాదాలతో పాటు జుట్టు కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. జుట్టు పొడిబారిపోయి జీవం లేనట్లు తయారవుతుంది. ఈ సమస్యకు గుడ్డులోని పచ్చసొనను ఒక బౌల్‌లో వేసుకోవాలి. అందులో సరిపడా ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. తయారైన మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. వెంట్రుకల కుదుళ్లకు పట్టేలా ఈ మిశ్రమాన్ని పట్టించి 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత మామూలుగా వినియోగించే షాంపుతో తలస్నానం చేసేయాలి. గుడ్డు జుట్టుకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. ఆలివ్ ఆయిల్ మన జుట్టుకు కావాల్సిన తేమను ఇస్తుంది.

కాళ్లవాపు: చలి ఎక్కువగా ఉన్న సమయంలో కాళ్లవాపు కూడా వస్తుంటుంది కొందరిలో. ఈ సమస్యకు గ్లాసు నీళ్లలో ఒక చెంచా ధనియాలు వేసుకుని నీళ్లు సగమయ్యే వరకు మరిగించాలి. ఆ నీళ్లను రోజుకు మూడు పూట్ల తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కాళ్ల వాపు తగ్గడంతో పాటు, శరీరంలో పెరిగే చెడు బ్యాక్టీరియా కూడా తగ్గుతుంది. అంతేకాకుండా వాపు ఉన్న ప్రాంతంలో నువ్వుల నూనెతో మర్దన చేయడం కూడా మంచిది.

దగ్గు, జలుబు: శీతాకాలం వచ్చిందంటే దగ్గు, జలుబు అనేక సర్వసాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు. ఇవి వచ్చిన సమయంలో గ్లాసు నీళ్లలో అల్లం ముక్క ఒకటి తీసుకుని నానబెట్టాలి. ఉదయం లేచిన వెంటనే ఆ నీళ్లను తాగేయాలి. అదే విధంగా ఆహారంలో కూడా కాస్తంత అల్లం ఉండేలా చూసుకోవడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. గొంతు నొప్పి, దగ్గు, జలుబు వస్తే పాలలో పసుపు కలుపుకుని రాత్రి పడుకునే ముందు తాగాలి. పసుపులోని యాంటీ బ్యలాక్టీరియల్ ఫంక్షన్ ఈ సమస్యలకు చెక్ పెడతాయి.

Read Also: ఉప్పునీరు తాగితే ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయా!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | ప్రాణం తీసిన పందెం.. బాంబుపై కూర్చున్న వ్యక్తి..

దీపావళి రోజున స్నేహితులతో కాసిన పందెం ఓ వ్యక్తి ప్రాణం బలితీసుకుంది....

Byelection | అసెంబ్లీ ఉపఎన్నిక వాయిదా.. మళ్ళీ అప్పుడే..

దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక(Byelection) జరగనుంది. ఈ నెల 13న...