మహిళలు పిల్లలకు జన్మనివ్వడం అనేది దేవుడు ఇచ్చిన ఒక వరం. మహిళలు ప్రసవించడం అంటే పునర్జన్మ ఎత్తడం అని అంటారు. ప్రసవం అప్పుడే కాదు డెలివరీ తర్వాత కూడా మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేవలం శారీరక ఇబ్బందులే కాదు మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు చెపుతున్నారు.
అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. గర్భం ధరించాక కాకరకాయని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే కాకరకలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని ఫలితంగా తల్లికి బిడ్డకు చాలా మేలు కలుగుతుంది. అందుకే గర్భిణులు కనీసం రెండు రోజులకోసారైనా కాకరకాయ తినేందుకు ప్రయత్నించాలి.
అంతేకాకుండా కాకరకాయలో చరంటిన్ , పాలీపెప్టైడ్-పి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గర్భిణీ స్త్రీల ప్రేగు కదలిక, జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ఈ కూరగాయలో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని హానికరమైన బ్యాక్టిరియాతో పోరాడే శక్తిని ఇచ్చి హానికరమైన వ్యాధులను మనదరికీ చేరకుండా కాపాడుతుంది.