ఇక్కడ వర్షాలకోసం పూజలు – ఎవరిని కొలుస్తారో తెలుసా – పెద్ద వేడుక

Worship for the rains

0
100

ప్రతీ ఏడాది వర్షాల కోసం ప్రజలు ఎదురుచూడటం సహజం. రైతులు ఈ వర్షాల కోసం ఎంతో ఆశగా చూస్తారు. మన దేశంలో వర్షాలు కురవడం ఆలస్యం అయితే, వరుణదేవుడి కరుణ కోసం పూజలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా యూపీ, బిహర్ లో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఇలా పూజలు, యాగాలు చేస్తూ ఉంటారు. అక్కడ సమయానికి వర్షాలు రాకపోతే పూజలు చేస్తారు. కొన్ని చోట్ల డ్రమ్ములు మోగిస్తూ వర్షాన్ని రావాలని కోరుకుంటారు. మరి కొన్ని చోట్ల రాత్రంతా కూర్చుని శ్లోకాలు చదువుతూ ఉంటారు..

రాజస్థాన్ లో అయితే యాగాలు నిర్వహిస్తారు. రాజస్థాన్ లోని ఒక ప్రాంతంలో వర్షం కోసం ప్రత్యేకంగా పూజలు చేసే విధానం ఉంది దాని గురించి చూద్దాం. ఇక్కడ ఇంద్రుడి వల్ల వర్షాల వస్తాయని నమ్ముతారు.

వర్షాలు రావాలి అంటే ముందు శ్రీ కృష్ణుడు ఇంద్రునికి ఆదేశం ఇవ్వాల్సి ఉంటుందని భావిస్తారు. రాజస్థాన్ లోని బాన్స్వారా జిల్లాలో రస్లీల అనే వేడుక వర్షాల కోసం చేస్తారు. ఇక్కడ ప్రజలు వర్షాలను కురిపించడం కోసం శ్రీకృష్ణుడు ఇంద్రదేవ్ ను ఆదేశిస్తున్నట్టుగా కళా రూపాల్ని ప్రదర్శిస్తారు. పెద్ద ఎత్తున బరోస్డియా గ్రామంలో ఈ వేడుక చేస్తారు. ఇది 100 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇది చేసిన రెండు మూడు రోజులకి కుండపోత వర్షాలు కురుస్తాయి. అందుకే ప్రజలు దీనిని బాగా నమ్ముతారు.