కృష్ణాష్టమి నాడు పూజ ఈ విధంగా చేయండి ఎంతో పుణ్యం

Worship on Krishnashtami is a great virtue

0
96
krishnashtami

కృష్ణాష్టమి నాడు భక్తులు ఉపవాసం ఉంటారు. అయితే ఆ కన్నయ్యని ఆలయాల్లో దర్శనం చేసుకుని ఇంటిలో కూడా పూజ చేసుకుని ఉపవాశం ఉంటారు. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయం కాలం శ్రీ కృష్ణుడిని పూజిస్తారు. ఈ సమయంలో ఏవి స్వామికి నైవేధ్యం పెడతారు అంటే ? శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.

ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడతారు. ఇక వీధుల్లో అందరూ చిన్న పిల్లలు పెద్దలు ఉట్లు కడతారు పోటీ పడి వాటిని కొడుతూ ఆనందిస్తారు. ఉట్ల పండుగ మన దేశంలో అన్నీ ప్రాంతాల్లో జరుగుతుంది.

కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపం వెలిగించాలి. ఆ కిట్టయ్యకి పూజలు పూర్తి అయ్యేవరకూ ఆ దీపాన్ని అలా వెలిగించి ఉంచాలి కొండెక్కనివ్వకూడదు. వివాహం కావాల్సిన వారు సంతానం లేని వారు బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే ఎంతో పుణ్యం. సంతానం కలుగుతుంది అని నమ్ముతారు.