నిత్యం ఆ శివయ్యని భక్తులు కొలుస్తూనే ఉంటారు. ఇక శివుడికి సోమవారం ఎంతో ప్రీతికరమైన రోజు, ఆ రోజు శివయ్యకి భక్తులు అభిషేకం కూడా చేస్తారు. స్వామి సేవలో ఉంటూ ఉపవాసం చేస్తారు. అయితే శివుడు బోళా శంకరుడు ఆయనకు చెంబుడు జలం అభిషేకం చేసినా ఆనందించి పరవశిస్తాడు. శివుడికి పూజ చేయడం వల్ల మనకు ఎలాంటి కష్టాలు ఉండవు ఆయన అనుగ్రహం కూడా కలుగుతుంది.
శివుడు కుబేరుని పాలకుడు అందుకే శివుడిని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఎలాంటి ఆర్ధిక సమస్యలు ఉన్నా మీకు తొలగిపోతాయి. మీరు జీవిత భాగస్వామితో కలిసి శివుడికి పూజలు చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఆర్ధిక సమస్యలు రావు.
శివుడికి ప్రతీ సోమవారం ఆవు పాలతో అభిషేకం చేయడం ఎంతో మంచిది. చెరకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కూడా కుటుంబానికి లభిస్తుంది. కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సొసైటీలో ఎంతో మంచి పేరు వస్తుంది గౌరవ మర్యాదలు ఉంటాయి. పంచామృతంతో శివునికి అభిషేకం చేయించడం వల్ల మీకు ఆ లక్ష్మీ కటాక్షం ఐష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి.