పెరుగు అంటే కొందరికి ఇష్టం ఉంటుంది .. మరికొందరికి ఇష్టం ఉండదు.. కొందరు పాల పదార్దాలు ఏమీ అంత తీసుకోరు, అయితే మరికొందరు గడ్డ పెరుగుతో భోజనం చేస్తారు ,ఇక భోజనం చేసిన తర్వాత కచ్చితంగా మజ్జిగ లేదా పెరుగు చాలా మంది తీసుకుంటారు.. మరికొందరు చక్కెరతో కూడా తీసుకుంటారు.
అయితే రాత్రి పూట పెరుగు వద్దు అని చాలా మంది చెబుతారు, రాత్రి పెరుగు తింటే బాగా లావు అవుతారు అని అంటారు, అంతేకాదు ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటారు, మరి నిపుణులు ఏమి అంటున్నారు అనేది చూద్దాం.. పెరుగు మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు అయినా తీసుకోవచ్చు… అయితే అది గరిటె కంటే ఎక్కువ తీసుకోవద్దు, కాస్త మాత్రమే తీసుకోవాలి.
ఇక రాత్రి పూట అయినా ఉదయం పూట అయినా పెరుగులో పంచదార కలిపి తీసుకోవద్దు.. దీని వల్ల బరువు ఊబకాయం సమస్యలు వస్తాయి.. వేడి తగ్గడం కాదు మరింత శరీరానికి వేడి చేస్తుంది… అందుకే పంచదార పెరుగు కాకుండా, చల్లటి మజ్జిగ రూపంలో తీసుకుంటే మంచిది. దీని వల్ల బరువు పెరగరు అని చెబుతున్నారు నిపుణులు.