రాగి పాత్ర‌లో నీరు తాగాల్సిందే..ఎందుకో తెలుసా?

0
95

సాధారణంగా మనం రాగి వస్తువులను ఎక్కువగా వాడుతూ ఉంటాము. రాగి పాత్రలు, రాగి గ్లాసులు ఇప్పుడు రాగి బాటిల్స్ కూడా వచ్చాయి. పూర్వికులు ఎక్కువగా రాగి సామాన్లను, ఉంగరాలను ధరించే వారు. మనం ఇప్పటికీ కొందరి ఇళ్లల్లో రాగి గ్లాసులు, రాగి పాత్రలు చూస్తు ఉంటాం.

అయితే రాగి చెంబుతో మన పెద్దలు నీరు పోసుకుని తాగేవారు. అందులో రాగికి యాంటి బ్యాక్టిరియల్ నేచర్ ఉందని, అందుకే రాగితో తయారు అయిన పాత్రలలో బ్యాక్టీరియా చేరదని చెబుతారు.

రాగి పాత్ర‌లో నిల్వ చేసిన నీటిని తాగ‌డం వ‌ల్ల జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. బ‌రువు కూడా తగ్గుతారు. గాయాల‌ను త్వ‌ర‌గా మానేలా చేసే గుణం కూడా రాగిలో ఉంటుంది. రాగి పాత్ర‌లోని నీటిని తాగ‌డం వల్ల గాయాలు కూడా త్వ‌ర‌గా మానుతాయి.

ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల కాలేయం, మూత్ర‌పిండాల ప‌ని తీరు కూడా మెరుగుప‌డుతుంది. రాగి పాత్ర‌లో నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వృద్ధాప్య ఛాయ‌లు తొల‌గిపోతాయి. థైరాయిడ్ గ్రంధి ప‌నితీరు పెరుగుతుంది.

రాగి పాత్ర‌లో నీటిని తాగితే మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. ర‌క్తహీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. శ‌రీరంలో ఉండే నొప్పులు , వాపులు త‌గ్గుతాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. రాగి పాత్ర‌లో నీటిని తాగ‌డం వ‌ల్ల చ‌ర్మ సౌంద‌ర్యం కూడా మెరుగుప‌డుతుంది. క‌నుక రోజూ అలా నీటిని తాగ‌డం మంచిది. దీంతో రోగాలు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.