ఈజీగా బరువు తగ్గాలంటే ఇవి తినాల్సిందే..!

0
131

ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యలలో అధిక బరువు ఒకటి. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఈ సమస్యను దూరం చేసుకోవడానికి అనేక రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. వాటితో పాటు ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటే బరువును చాలా వరకు కూడా నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో, రెండు వెల్లుల్లి రెబ్బలను నోట్లో వేసుకుని తినడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. కానీ వెల్లుల్లి తిన్న తర్వాత దాదాపు గంట వరకు మీరు ఏమీ తినకూడదు. ఆ తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఒక నిమ్మకాయ పిండుకుని దానిని తాగాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మీ బరువు తగ్గడమే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ఇంకా ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే అన్ని సమస్యలూ దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ప్రతిరోజూ ఉదయంపూట ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే ఇందులో ఉండే అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  బరువు తగ్గాలనుకునే వారు అల్పాహారంలో ఇడ్లీ తీసుకోవడం మంచిది.