ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. మన ఆరోగ్యం పదిలంగా ఉండడం కోసం మనకు ఇష్టంలేని పదార్దాలను సైతం ఇష్టం చేసుకొని తింటుంటాము. అలాగే రోజు ఈ డైట్ ను మెయింటైన్ చేశారంటే అన్ని రకాల విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా లభించి ఆరోగ్యంగా ఉంటారు. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి..
మనం ఎంత తిన్నామన్నది ముఖ్యం కాదు, అన్ని రకాల పోషకాలు లభిస్తున్నాయా? లేదా? అన్నది ముఖ్యం. ఒకవేళ మన శరీరానికి కావాల్సిన పోషకాలు లభించకపోతే అనేక ఆరోగ్యసమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మంచి ఆహారం తీసుకోవాలి.
ఆకుకూరలు, ఫలాలు, బీన్స్, బాదం వంటి గింజలు మనం రోజు తినడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరి ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉంటాము. గింజధాన్యాలు, మాంసం, పాలు, పెరుగు, మజ్జిగ, చీజ్ వంటి ఆహారపదార్దాలు తీసుకోవడం వల్ల ఖనిజాలు లభిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తిని ఆరోగ్యంగా జీవించండి.