చెమట పడితే ఆరోగ్యానికి మంచిదేనా తప్పక తెలుసుకోండి

You must know if sweating is good for health

0
96

ఈ రోజుల్లో చాలా మంది శారీరక శ్రమ చాలా తక్కువగా చేస్తున్నారు. అంతా కంప్యూటర్ పై చేసే ఉద్యోగాలు కావడంతో శారీరక శ్రమ తక్కువగా ఉంటోంది. కొంచెం చెమట పట్టినా అది పట్టకుండా ఏసీలోకి వెళ్లిపోతున్నారు. దీని వల్ల చాలా మంది అసలు ఈ చెమటలు కూడా పట్టకుండా ఉంటున్నారు. కానీ శరీరం నుంచి చెమట రావడం చాలా ముఖ్యమని తెలుసుకోండి వైద్యులు అదే చెబుతున్నారు.

మనిషికి బాగా చెమట పట్టింది అంటే అతను ఆరోగ్యంగా ఉన్నాడు అని అర్దం. కాని ఇప్పుడు ఇలా చెమట పట్టకుండా చాలా సింపుల్ గా మన వారు ఉంటున్నారు. మనిషికి చెమట రాకపోతే శరీరంలో ఉన్న మలినాలు చర్మం నుంచి బయటకు వెళ్లవని వైద్యులు చెబుతున్నారు. ఇలా చెమట పట్టడం వల్ల మలినాలు బయటకు వెళతాయి. మొఖం మీద మొటిమలు రాకుండా ఉంటాయి అని చెబుతున్నారు నిపుణులు.

వ్యాయామం చేసేటప్పుడు చెమట పట్టడం చాలా ముఖ్యం చెమట మీ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.
చెమట రావడం వల్ల శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. చర్మంపై పేరుకుపోయిన టాక్సిన్స్ కూడా చెమట ద్వారా బయటకు వస్తాయి. ఇలా చెమట పడితే రోగనిరోధక శక్తి బలంగా ఉన్నట్లు కూడా వైద్యులు చెబుతున్నారు.