మనం బెల్లం పానకం గురించి వింటాం.. ముఖ్యంగా దేవాలయాల్లో ఈ పానకం ఇస్తూ ఉంటారు, అయితే బెల్లం పానకం తాగడం ఆరోగ్యానికి మంచిది. అయితే రోజూ కాకుండా రెండు మూడు రోజులకి ఓసారి బెల్లం పానకం ఓ గ్లాసు తీసుకున్నా మంచిది అంటున్నారు వైద్యులు.. ముఖ్యంగా కొందరికి బెల్లం తింటే పడదు.. అలాంటి వారు బెల్లం పానకం తీసుసుకోకండి ఎలాంటి సమస్యలు లేని వారు మాత్రమే తీసుకోండి వైద్యులని సంప్రదించి.
అయితే బెల్లం అనేది శరీరానికి చాలా మంచి చేస్తుంది, ఐరెన్ పుష్కలంగా ఉంటుంది..బెల్లం పానకం తాగితే తొందరగా బరువు తగ్గుతారు.. గోరువెచ్చని బెల్లం పానకం తాగడం వల్ల మల విసర్జన సాఫీగా జరుగుతుంది అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా ఊబకాయం అధిక బరువు సమస్య ఉన్న వారికి ఇది చాలా మేలు చేస్తుంది.
కడుపులోని విష పదార్థాలు బయటకు పోయి జీర్ణసంబంధమైన వ్యాధులు ఉంటే తగ్గుతాయి. బాడీ టెంపరేచర్ స్ధిరంగా ఉంటుంది…మలబద్దకం సమస్య ఉంటే దీని వల్ల తగ్గుతుంది, కడుపులో మంట ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. బాడీకి ఐరెన్ అందిస్తుంది…రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు సీజన్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అయితే నిత్యం కాకపోయినా రెండు మూడు రోజులకి ఓసారి ఇలా తీసుకుంటే మంచిది.