ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి అని చూసుకుంటారు, ముఖ్యంగా మనం తినే ఫుడ్ బట్టీ మన ఆరోగ్యం ఉంటుంది.మెటబాలిజం రేట్ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. బరువు నియంత్రణలో ఉండాలన్నా ఈ మెటబాలిజం రేటుపైనే ఆధారపడి ఉంటుంది. మరి మన పోపుల పెట్టెలో ఉండే కొన్ని ఫుడ్స్ చాలా ఆరోగ్యకరం. మరి ఆ ఔషదాలు ఏమిటో చూద్దాం.
పసుపు..మన శరీరంలో కొవ్వు ను కరిగిస్తుంది, ఇది రోజు మనం ఫుడ్ లో తీసుకోవడం మంచిది, బరువు తగ్గడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
దాల్చినచెక్క..యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీని కలిగి ఉంటుంది. , కొవ్వును కరిగిస్తుంది. పొట్ట దగ్గర బాన పొట్ట కొవ్వును ఇది కరిగిస్తుంది.
అల్లం..ఇది బరువును తగ్గిస్తుంది, అంతేకాదు శరీరానికి ఎలాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.
వెల్లుల్లి..ఇవి తినడం వల్ల శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోతుంది. తియ్యని పదార్థాలు, అధిక ఆహారం, జంక్ఫుడ్, ఆయిల్ఫుడ్స్ తీసుకోవాలనే కోరికను తగ్గిస్తుంది.
నల్ల మిరియాలు.. ఇవి చాలా మంది పాలలో పొడి చేసుకుని తాగుతారు… ఇది చాలా మంచిది, అంతేకాదు చిటికెడు పసుపుతో ఇవి తీసుకున్నా మంచిదే.
జీలకర్ర.. జీలకర్ర బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇక ఉదయం జీర పౌడర్ ని వాటర్ లో మరిగించి చల్లారిని తర్వాత తాగితే ఎంతో ప్రయోజనం.
మెంతులు.. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది, ముఖ్యంగా రాత్రి నానబెట్టి అవి ఉదయం ఓ స్పూన్ తీసుకున్నా మంచిదే.. షుగర్ సమస్య తగ్గుతుంది, జలుబు లాంటి సమస్యలు రావు. బరువు తగ్గుతారు.