ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి మలబద్దక సమస్య ఉంది.. కోట్లాది మంది మలబద్దకంతో బాధపడుతున్నారు… పైకి ఎవరికి చెప్పుకోలేరు… అయితే ఈ సమస్య నుంచి బయటపడటం కూడా మన చేతుల్లోనే ఉంటుంది.. మనం తినే తిండి బట్టీ కూడా ఉంటుంది.. అసలు మలబద్ధకం రావడానికి లక్షణాలు ఉన్నాయి. ఇలా ఉంటే అది మలబద్దకం అనే చెప్పవచ్చు.
చాలా మందికి బాత్రుమ్ కి వెళ్లి అరగంట అయినా మలం రాదు.. ఇది కచ్చితంగా మలబద్దకమే, అంతేకాదు వారికి బాంబులు లాంటివి వస్తూ ఉంటాయి.. కాని స్మెల్ తో మలం రాదు, ఇది మరింత మలబద్దక సూచన, ముఖ్యంగా రెండు మూడు రోజులకి మలానికి వెళ్లడం మలబద్దకం, అంతేకాదు వారానికి మూడు సార్లు వెళుతున్నారు అంటే మలబద్దకం సమస్య ఎక్కువ ఉన్నట్లు.
మలం గట్టిగా లేదా ఎండిపోయినటువంటి మలవిసర్జన జరగడం కూడా దీనికి లక్షణం, ఇక మీకు నొప్పి రావడం ఉగ్గ పట్టుకు కూర్చోవడం, నొప్పితో కూడిన రక్తం రావడం ఇవన్నీ కూడా మలబద్దక సమస్యలే… ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మలబద్దకం అని గుర్తించాలి.