నవ్వు వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

0
109

నవ్వడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ నవ్వు నాలుగు విధాలా చేటు అని పెద్దలు చెబుతుంటారు. అయితే ఇందులో ఎంతమాత్రమూ నిజములేదని నిపుణులు అంటున్నారు. కానీ ప్రస్తుతకాలంలో చాలామంది వ్యాపారాల బిజీలో పడి నవ్వుకు దూరమవుతున్నారు.

కానీ కడుపుబ్బా నవ్వితే అనేక ఆరోగ్యసమస్యలు దూరమవుతాయి.  నవ్వు ఒత్తిడిని తగ్గించే ఒక మెడిసిన్ అంటున్నారు వైద్యులు. నవ్వు వల్ల మనసు ఉల్లాసపడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గట్టిగా నవ్వడం వల్ల శరీరానికి ఆక్సీజన్ కూడా బాగా అందుతూ గుండె సంబంధిత రోగాలు దరిచేరవు. థైరాయిడ్, మైగ్రేన్, స్పాండిలైటిస్ వంటి సమస్యలకు ఎటువంటి ఖర్చులేకుండా నవ్వు దివ్యఔషధంగా ఉపయోగపడుతుంది.

నవ్వితే శరీరంలోని 108 కండరాలు ఉత్తేజితం అయ్యి బీపీ అదుపులో ఉంటుంది. తాజగా నిపుణులు చేసిన పరిశోధనల వివరాల ప్రకారం..15 నిమిషాల పాటు నవ్వితే శరీరంలోని సుమారు 40 కేలరీలు కరిగిపోతాయి. నొప్పుల నివారణకు తోడ్పడే ఎండార్ఫిన్ నవ్వు ద్వారా లభిస్తుంది. ముఖ్యంగా డిప్రెషన్‌లో ఉన్నవాళ్లకు నవ్వు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.