చిక్కిన పులసలు ఒక్కో చేప ఎంత ధర పలికిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

You would be surprised to know how much pulasa fish cost

0
99

పుల‌స‌ల కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అయితే గ‌త ఏడాది కంటే ఈసారి పుల‌స‌లు వ‌లకు చాలా త‌క్కువ‌గా చిక్కాయి అని అంటున్నారు మ‌త్స్య‌కారులు. అందుకే వ‌చ్చిన కొన్ని పుల‌స‌లు కూడా కాస్త రేటు ఎక్కువ ప‌లుకుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైనా యానాం నియోజకవర్గంలో సుమారు రెండు కేజీలపైగా బరువు ఉన్న గోదావరి పులసలు రెండు వ‌ల‌లోప‌డ్డాయి.

ఇక మ‌త్స్య‌కారులు చాలా ఆనంద‌ప‌డ్డారు వారు ఊహించిన దాని కంటే అధిక రేటు వ‌చ్చింది.
యానాం గౌతమీ గోదావరీలో మార్కెట్ ద‌గ్గ‌ర గోదావరి ఒరిజినల్ సెనా పులస భారీ ధ‌ర ప‌లికింది.
రెండు కేజీల బరువు ఉన్న చేప 20,000 వేలకు అమ్మారు. తాజాగా మరో రెండు పులసలు స‌రికొత్త రేటుకి అమ్మారు.

రెండు పులసల కోసం పుల‌స‌ ప్రియులు కొనడానికి ఎగబడ్డారు. ఒకటి 25 వేలు, మరొకటి 23 వేల ధరకు అమ్ముడయ్యాయి. ఒక్కొక్క‌టి రెండు కేజీల‌పైనే బ‌రువు ఉన్నాయి. ఇలా పాట‌పాడి వాటిని సొంతం చేసుకున్నారు.యానాం గౌతమీ గోదావరీలో ఇదే భారీ రేటు అంటున్నారు అక్క‌డ మార్కెట్ వారు.