జపాన్ లో యువత డబ్బులు ఎక్కువ దేనికి ఖర్చు చేస్తున్నారంటే

Young people in Japan are spending more money on something

0
97

జపాన్ దేశస్తుల గురించి చెబితే వారికి ఏదైనా పని అప్పచెబితే అది పూర్తి అయ్యే వరకూ వేరే పనిమీద వారి ఫోకస్ ఉండదు. అంతేకాదు పనిలో పడి ప్రేమ అనే దానికి చాలా మంది యువత దూరం అయ్యారు. అమ్మాయిలు అబ్బాయిలు డేటింగ్ లవ్ దీనికి చాలా దూరంగా ఉంటున్నారు జపాన్ లో. అంతేకాదు 30 ఏళ్లు వ‌చ్చినా సోలోగానే ఉంటాం అని అంటున్నారు.

అయితే ఇక్కడ ఓవర్ టైమ్ వర్క్ అనేది ఎక్కువ మంది చేస్తున్నారు. అందుకే ఇక్కడ కొత్త రూల్ ఏమి తెచ్చారు అంటే ,నెలకు 60 గంటలకు మించి ఓవర్ టైమ్ చేయడానికి వీల్లేదని నిబంధన కూడా విధించింది. ఒకవేళ జనాభా యువత ఇలాగే ఉంటే వచ్చే రోజుల్లో దేశంలో ఇబ్బందులు తప్పవు అని అంటున్నారు మేధావులు. 2060 నాటికి జపాన్ జనాభా 86 మిలియన్లకు పరిమితమైపోతుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి.

ఇక నిద్ర కూడా చాలా మంది తక్కువగా నిద్రపోతున్నార‌ట‌. ఇప్పటి యువత దాదాపు రోజుకి 5 గంటలు మాత్రమే నిద్రపోతున్నారట. అయితే ఎక్కువ డబ్బులు లగ్జరీ గూడ్స్ మొబైల్స్ కి ఫుడ్ కి ఖర్చు చేస్తున్నారు. అబ్బాయిల సంపాదనలతో అమ్మాయిలకి కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమ ఖర్చు చేస్తున్నారట.