మీ చెవిలో గులిమి బట్టి మీ ఆరోగ్యం చెప్పవచ్చు

Your health depends on the Earwax in your ear

0
76

కొందరు పైకి చాలా ఆరోగ్యంగా కనిపిస్తారు కాని వారికి శరీరంలో అనేక సమస్యలు ఉంటాయి. కొందరు వాటిని వెంటనే గుర్తిస్తారు. మరికొందరు కాస్త అనారోగ్యంగా ఉన్న తర్వాత ఆస్పత్రికి వెళితే కాని తెలియదు ఆ సమస్య ఉందని. ఇక కొందరికి చెవిలో గులిమి సమస్య వేధిస్తుంది. అయితే ఇది మరీ ఎక్కువగా వస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలి.

చెవిలో ఉండే గులిమి రంగు సైతం మీ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంది. పదే పదే గులిమి వస్తుంది అంటే అశ్రద్ద చేయవద్దు. ఇక కొందరికి ఇది బూడిద రంగులో వస్తుంది. ఇలా వస్తే భయం అక్కర్లేదట. ఎందుకంటే మనం ఉండే నగరాల్లో కాలుష్యం వల్ల చెవిలో గులిమి ఇలా బూడిద రంగులో ఉంటుంది. ఇక కొందరికి ఈ గులిమి వచ్చే సమయంలో రక్తం వస్తుంది. ఇలా వస్తే చాలా డేంజర్ వారికి కర్ణబేరి సమస్య ఏమైనా ఉందా అనేది చూపించుకోవాలి.

గులిమి గోధుమ రంగులో ఉంటే మీరు ఒత్తిడితో ఉన్నారని అర్థం. ఇక కొందరికి నలుపు రంగులో గులిమి వస్తుంది ఇలా వస్తే మీకు ఏదైనా ఫంగల్ ఇన్ఫె క్షన్ సోకింది అని అర్ధం. తెలుపురంగులో ఉంటే ఐరన్, కాపర్ లోపం అని అర్దం. ఇక చెవిలో పిన్నులు పెట్ట‌కండి రసాయనాలు ఎప్పుడూ పోయవద్దు .ఇయర్ బడ్స్ తో శుభ్రం చేసుకోండి. పసర్లు లాంటివి కూడా నొప్పి వస్తుంది అని పోయవద్దు.