ఆధునిక జీవితశైలి, ఆహారపు అలవాట్లు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా కిడ్నీల సమస్యతో బాధపడువారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ఆహారపు అలవాట్ల వల్లనే కిడ్నీ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఏదైనా సమస్య అన్పిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అనేది మూత్రం ద్వారానే తెలుస్తుంది. మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపించడం, మూత్రం రంగు మారడం వంటి సంకేతాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. ప్రముఖ నెఫ్రాలజిస్టులు క్రియాటినైన్ పరీక్ష చేయించుకుంటే కిడ్నీల పనితీరు తెలిసిపోతుందని చెబుతున్నారు.
సిరమ్ క్రియాటినైన్ పరీక్షతో శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాల తీరు తెలిసిపోవడంతో పాటు..శరీర కండరాలు దెబ్బతినడం, తీసుకునే ఆహారంతో కూడా క్రియాటినైన్ ఎంతుందో తెలుస్తుంది. సాధారణంగా 0.8 నుంచి 1.2 వరకు ఉంటుంది. ఎక్కువగా ఉంటే కిడ్నీలు పనిచేయడంలో ఎక్కడో లోపం ఉందని తెలుస్తుంది. ఇలాంటి వారికి ఆకలి ఉండకా..వాంతులు అవుతాయి. కాళ్లవాపులు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.