దేశంలో కరోనా రికార్డ్ ఒక్క రోజే లక్ష దాటేసింది

-

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.. భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి… లాక్ డౌన్ సమయంలో ఎలా కేసులు వచ్చాయో చూశాం, ఇప్పుడు సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది కరోనా….ఏకంగా గత 24 గంటల్లో కొత్తగా 1,03,558 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇన్నీ భారీ కేసులు నమోదు కావడం ఇదే దేశంలో తొలిసారి, ఇక నిన్న కరోనాతో 478 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా ఇప్పటి వరకు 1,25,89,067 మంది కరోనా బారినపడ్డారు. ఇక చాలా నగరాల్లో మినీ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు,
భారీగా కేసులు బయట పడటంతో అందరూ ఆందోళన చెందుతున్నారు, ఇక చాలా ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూలు కూడా అమలు అవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా 7,41,830 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 7 కోట్ల 91 లక్షల మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు.
కచ్చితంగా మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలి అని తెలియచేస్తున్నారు నిపుణులు, ముఖ్యంగా ఎన్నో కేసులు కొత్తవి నమోదు అవుతున్నాయి. రికవరీల కంటే కొత్త కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...

Nitish Kumar | రాజకీయాల్లోకి బీహార్ సీఎం నితీశ్ కుమార్ తనయుడు..?

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar)...