పిక్క’ను మన శరీరపు రెండో గుండెకాయగా పరిగణిస్తారు..ఎందుకో తెలుసా?

0
315

మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమో అందరికి తెలుసు. మనిషి శరీరంలో గుండె కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో గుండె ఎంత ముఖ్యమో మోకాలు కూడా అంతే ముఖ్యమంటున్నారు నిపుణులు. గుండె చేసే పని మోకాలు కూడా చేస్తుందని మీకు తెలుసా?  ఈ అంశం పై కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

గుండె ఎలా మన శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుందో.. అలాగే కాళ్ల పిక్కలు కూడా రక్తాన్ని పైకి పంపించడంలో దోహదం చేస్తాయి.అంతేకాకుండా గుండె నుంచి పంపించే రక్తం భూమ్యాకర్షణ శక్తి వల్ల మన కాళ్లకు చేరడం మరింత  సులభం. కానీ తిరిగి అక్కడి నుండి పైకి చేరటానికి పిక్కలే కీలకంగా పనిచేస్తాయి. అందుకే ‘పిక్క’ను మన శరీరపు రెండో గుండెకాయగా పరిగణిస్తారు

పిక్కబలంగా ఉంటే.. మన గుండె బలంగా ఉన్నట్లే.. గుండె తన సరఫరా ప్రక్రియ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ రక్తాన్నిఅందిస్తుంది. రక్తంతోపాటు అదనపు బరువైన ఆక్సిజన్‌నూ, పోషకాలనూ తనతో మోసుకు వెళ్ళుతుంది. దీనినే కాఫ్‌ మజిల్‌ పంవ్, పెరిఫెరల్‌ హార్ట్‌  అంటారు. మన శరీరపు రెండో గుండె అయిన పిక్క సరిగా పనిచేయకపోతే కండరాలు తీవ్రమైన అలసటకు గురవ్వాల్సి వస్తుంది.