ఆప్యాయత మర్యాదలు పేరు చెబితే గోదావరి తర్వాతే ఎవరైనా అంటారు. ఇక రకరకాల వంటకాలతో గోదావరి జిల్లాల్లో ప్రతీ ఊరు ఫేమస్ అనే చెప్పాలి. ఇక అత్తమామలు కొత్త అల్లుడికి చేసే మర్యాదలు కూడా మనం వీడియోలు ఫోటోలు చూస్తు ఉంటాం. సంక్రాంతి సమయంలో అనేక ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంటేనే మర్యాదలకు, పసందైన విందులకు పేరు. భీమవరంలో ఇటీవలే ఓ కోడలు అత్తగారి పుట్టిన రోజున 60 రకాల వంటకాలు చేసి అదరగొట్టేసింది. ఇప్పుడు ఓ కోడలికి మామగారు 150 రకాల ఐటమ్స్ విందు ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
భీమవరానికి చెందిన తుంపూడి వెంకటకృష్ణ గుప్తా తన కోడలు తేజస్విని పుట్టిన రోజు సందర్భంగా పసందైన వంటకాలు చేయించారు. మొత్తం 150 రకాలతో తన కోడలి కోసం ఇవన్నీ చేయించారు. ఇక ఆ కోడలు చాలా ఆనందించింది. మరి ఆ వంటకాలు చూద్దామా.
14 రకాల రైస్ ఐటమ్స్, 35 రకాల స్వీట్స్, 35 రకాల హాట్స్, 20 రకాల చాక్లెట్లు, 20 రకాల కేకులు, 11 రకాల బజ్జీలు, 15 రకాల పండ్లు కేకులతో విందు ఏర్పాటు చేశారు.