మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడనే మంత్రి కేటీఆర్ విషప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. బీజేపీ గెలుస్తుందన్న భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కంపెనీలపై కేటీఆర్ ఆరోపణలు సరికాదని హితువు పలికారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారమే రాజగోపాల్ రెడ్డికి నాలుగు కాంట్రాక్టులు వచ్చాయి కానీ, బీజేపీ ప్రభుత్వం వల్ల కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ కమీషన్ల కోసం కక్కుర్తి పడటంతోనే జెన్‌కో వంటి వాటి వల్ల ప్రభుత్వానికి 29 వేల కోట్ల రూపాయలు నష్టపోయామని ఆరోపించారు. తప్పుడు ఆరోపణలపై విచారణకు సిద్ధంగా ఉన్నామని వివేక్ సవాల్ విసిరారు. టీఆర్ ఎస్ ఓడిపోతుందన్న భయంతోనే, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం మునుగోడుకు క్యూలు కడుతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ఎన్ని కుట్రలు చేసినా, మునుగోడులో బీజేపీ గెలుపు బావుటా ఎగురవేస్తుందని వివేక్ ధీమా వ్యక్తం చేశారు.