తెలంగాణ గోపాలమిత్రులకు శుభవార్త

-

తెలంగాణలో రైతుల నేస్తంగా పిలిచే గోపాలమిత్రలకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. గోపాలమిత్రులకు దసరా కానుక ఇస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. 30 శాతం జీతాలు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రస్తుతం రూ. 8,500 చెల్లిస్తుండగా, 30 శాతం అంటే రూ. 2,550 పెంచి మెుత్తం రూ. 11,050 ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ జీతాల పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా మెుత్తం 1530 మంది గోపాలమిత్రలు లబ్ధిపొందుతున్నట్లు వివరించారు. వీరికి రూ.3,500గా ఉన్న జీతాన్ని ఒకేసారి రూ.8,500లకు సీఎం కేసీఆర్‌ పెంచినట్లు గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరే విధంగా సంస్కరణలు చేస్తుందని మంత్రి అన్నారు. గోపాలమిత్రులు పాడి రైతులతో నేరుగా సంప్రదింపులు చేసిన కృషి ఫలితంగా పాల సేకరణ రికార్డు స్థాయిలో పెరిగినట్లు వివరించారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వటంతో పాటు, పాడి గేదెల గర్భధారణ, నట్టల నివారణ మందులు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూ, గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ఉంటున్నారని మంత్రి కితాబునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...