జో బైడెన్ కీలక నిర్ణయం.. ప్రపంచ దేశాలు షాక్

-

గంజాయి వినియోగిస్తూ పట్టుబడి జైలు శిక్ష అనుభవిస్తున్నవారిని వెంటనే విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. జో బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం అక్కడ రాజకీయంగా చర్చానీయాంశంగా మారింది. అయితే.. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జో బైడెన్ దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం ఓ వీడియోను విడుదల చేసింది. దీనిలో ఆయన మాట్లాడుతూ.. గంజాయిని కలిగి ఉన్నందుకు, వాటిని వాడినందుకు జైలులో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుల వల్ల చాల మంది జీవితాలు నాశనం అవుతున్నాయని, ఈ గంజాయి ఆరోపణల కారణంగా ప్రజలకు ఉపాధి, ఇల్లు, విద్యావకాశాలు లభించడం లేదని పేర్కొన్నారు. గంజాయిని వినియోగించే వారిలో శ్వేతజాతీయులు, నల్లజాతీయులు అనే వ్యాత్యాసం ఏమీ లేదనీ.. ఇరు జాతీయులు సమానంగా గంజాయిని ఉపయోగిస్తున్నారని.. కానీ నల్లజాతీయులపైనే ఎక్కువగా పెడుతున్నారన్నారు. అందుకే ఫెడరల్ లా కింద దోషులుగా తేలిన వేలాది మందికి శిక్షను రద్దు చేసినట్లు జో బైడెన్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...