కిన్నెరసాని రివ్యూ

-

నటీనటులు : కళ్యాణ్ దేవ్, ఆన్ శీతల్, రవీంద్ర విజయ్, బ్యాక్ స్టార్ షాన్, సత్య ప్రకాష్, శ్రేయ త్యాగి, అప్పాజీ, లావణ్య రెడ్డి, సంవిత
సినిమాటోగ్రఫీ : దినేష్ కె బాబు
మ్యూజిక్ : మహతి స్వర సాగర్
నిర్మాత : రజనీ తాళ్లూరి, రవి చింతల
దర్శకుడు : రమణ తేజ
ఓ టీ టీ విడుదల తేదీ : జూన్ 10, 2022

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరో గా నటించిన సినిమా కిన్నెరసాని. తొలి రెండు సినిమాలతో అందరిని ఆకట్టుకున్న ఈ హీరో ప్రేక్షకులలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా ఇప్పుడు ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు పెరిగాయి. మంచి అంచనాల మధ్య ఏర్పడిన ఈ సినిమా మొదటగా థియేటర్లలోనే విడుదల చేయాలనీ భావించగా అనుకోని కారణాల వల్ల ఓటీటీ లో విడుదల కావడం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష చూసి తెలుసుకుందాం.

కథ :

జయదేవ్ (రవీంద్ర విజయ్) కిన్నెరసాని అనే పుస్తకాన్ని రాశారని కిన్నెరసాని కిన్నెరసన్మి వివరిస్తుంది, అయితే వేద (ఆన్ శీతల్) ఆమె గతం, వర్తమానం మరియు భవిష్యత్తుకు కీలకమైన పుస్తకాన్ని కనుగొంటుంది. ఇంతలో లాయర్ వెంకట్(కళ్యాణ్ దేవ్) తన ప్రేమికుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అనిశ్చిత భవిష్యత్తు నుండి వారిద్దరినీ రక్షించడానికి వెంకట్ వేదకి సహాయం చేస్తాడు.

విశ్లేషణ :

మంచి సినిమా థియేటర్లలో చూడాలనుకోవడం సహజమే. ధియేటర్ లో ఆ సినిమా చూడకపోతే ఎంతో నిరుత్సాహపడుతుంటారు. అలాంటి సినిమానే కిన్నెరసాని. మొదటి నుంచి చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ దర్శకుడు సినిమాను ఎంతో బాగా చేశాడు. ఈ సినిమాలో కథ హైలైట్ అనే చెప్పాలి. దానికి తగ్గ స్క్రీన్ ప్లే కుదరడంతో ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. అంతేకాదు మాటలు కూడా ఎంతో హృద్యంగా ఉన్నాయి. కొత్తగా వినపడ్డాయి. సాయి తేజ దేశరాజు రచన ప్రతిభ ఈ సినిమాలో స్పష్టంగా కనపడుతుంది. ఇంటర్వెల్ వరకు స్టోరీ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోదు దాన్ని సెకండాఫ్‌లో కూడా ఎక్కడ తగ్గకుండా చేశారు. నటీనటులు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా నటించారు. హీరో గా కళ్యాణ్ దేవ్ ఎంతో పరిణితి తో నటించాడు. గత సినిమాలకంటే అయన నటన బాగా డెవలప్ అయ్యింది. హీరోయిన్ ఆన్ సీతల్ బాగానే నటించింది. ఇతర నటీనటులు తమ తమ పాత్రల్లో బాగానే మెప్పించారు. ఈ సినిమా కి సంగీతం ఆయువు పట్టు అని చెప్పాలి. మహతి స్వర సాగర్ సంగీతం ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలు తమ పనిమేరకు బాగానే చేశారు. నిర్మాణ విలువలు ఎంతో రిచ్ గా ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా చూడవలసిన సినిమా. స్లో అండ్ స్టడీ సినిమాలు ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.

రేటింగ్ : 3/5

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...