చైనాకు పాక్‌ కుక్కలు, గాడిదలు!

-

పాక్‌ను తీవ్రమైన ఆర్థిక సంక్షోభం అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో వచ్చిన వరదలు, ఆ దేశాన్ని మరింత కుంగదీశాయి. దీంతో ఎలాగైనా సరే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆ దేశ ప్రభుత్వం సరికొత్త దారులను ఎన్నుకుంటుంది. అందులో భాగమే, చైనాకు తమ దేశ గాడిదలు, కుక్కలను ఎగుమతి చేసేందుకు నిర్ణయం తీసుకుంది. చైనా సాంప్రదాయ ఔషధాల తయారీలో గాడిదల చర్మాన్ని ఉపయోగిస్తారు. వాటి చర్మం నుంచి డంకీ హైడ్‌ జిలాటిన్‌ అనే దాన్ని తీసుకొని మందుల తయారీలో వాడుతారు. తమ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవటానికి, చైనా అవసరాన్ని ఓ మార్గంగా పాక్‌ తీసుకుంది. గాడిదలు అత్యధికంగా ఉన్న దేశాల్లో పాకిస్థాన్‌ మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం సుమారు 57 లక్షల గాడిదలు పాకిస్థాన్‌లో ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో పాక్‌ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు మాట్లాడుతూ, గాడిదలు, కుక్కలను దిగుమతి చేసుకునేందుకు చైనా ఆసక్తి చూపుతోందని అన్నారు. సెనేటర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ మాట్లాడుతూ, మాంసం దిగుమతి గురించి చైనా రాయబారి చాలాసార్లు ప్రస్తావించారని వివరించారు. ఆఫ్ఘానిస్థాన్‌లో పశువుల ధర తక్కువుగా ఉండటంతో, అక్కడ పశువులను కొనుగోలు చేసి, వాటి మాంసాన్ని చైనాకు ఎగుమతి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం ఉందని మరొక సభ్యుడు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...