మిక్స్‌డ్‌ టాక్‌లోనూ పొన్నియన్‌ సెల్వన్‌-1 రికార్డ్‌ కలెక్షన్‌

-

సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియన్‌ సెల్వన్‌ మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 230 కోట్లు కొల్లగొట్టిందీ చిత్రం. ఈ విషయాన్ని తెలుపుతూ, ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేష్‌ బాలా చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. మూడు రోజుల మెుదటి వారాంతంలో పీఎస్‌ 1 ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద రూ. 230 కోట్లు సాధించిందని ట్వీట్‌లో రాశారు. మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికీ, ఓవర్సీస్‌లో అద్భుతమైన రెస్పాన్స్‌ రావటం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కలెక్షన్లు లెక్కలు నిజమేనా.. లేక నిర్మాతలు కావలనే ఇటువంటి లెక్కలు చెప్తున్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి ఈ సినిమాను చేసేందుకు కసరత్తులు చేసి, చివరికి రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేశారు. పీఎఎస్‌ 1 గా మెుదటి భాగాన్ని విడుదల చేశారు. లైకా ప్రొడక్షన్‌, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. కాగా ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్‌, త్రిష, విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాళ నటించారు. వీరిలో కార్తీ నటనకు విమర్శకుల ప్రశంసలు కురుపిస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...