Rajagopal Reddy: నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా

-

మునుగోడు ఉపఎన్నిక బీజేపీ (BJP) అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి (Rajagopal Reddy) నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశమంతా ఇప్పుడు మునుగోడు వైపు చూస్తోందని అన్నారు. మునుగోడు ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. తనపై కావాలనే అపనిందలు వేస్తున్నారనీ.. తప్పు చేసినట్లు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజగోపాల్‌ రెడ్డి సవాల్‌ చేశారు. ఆరోపణలు రుజువు చేయకపోతే ఆరోపణలు చేసేవారు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రెండు నెలలుగా అమ్ముడుపోయానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని.. తాను అమ్ముడిపోయే వ్యక్తిని కాదని రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. తప్పుడు ఆరోపణలు చేసే వ్యక్తులను కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. ఒక నియంతకు బుద్ధి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. (KCR) కేసీఆర్‌కు దమ్ముంటే.. మునుగోడు నుంచి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదనీ. వచ్చే బతుకమ్మ నాటికి (KAVITHA) కవిత తీహార్‌ జైలు(Tihar Jail)కు  వెళ్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు

- Advertisement -

Read also:Tulasi Reddy: రాయలసీమకు జగన్ ద్రోహం

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...