Ramgopal Varma: హే గరికపాటి పబ్లిసిటీ కోసం ఫిల్మ్‌ ఇండస్ట్రీ మీద మొరగకు

-

Ramgopal varma satirical comments on Garikapati Narasimha rao: ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో చిరంజీవిని గరికపాటి అన్న వ్యాఖ్యలను మెగాస్టార్‌ లైట్‌ తీసుకున్నా.. ఆయన ఫ్యాన్స్‌ మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. అంత త్వరగా ఈ వివాదం ముగిసేలా కనిపించటం లేదు. తాజాగా వివాదాస్పద డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ, గరికపాటి చేసిన ట్వీట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహా. ఆ మిగిలిన రావును మీ పంచ జేబులో పెట్టుకోండంటూ ట్వీట్‌ చేశారు.

- Advertisement -

నాగబాబు గారు మీ అన్నయ్యను, ఆ గడ్డి అన్న మాటలకు దాన్ని తినెయ్యకుండా వదిలెయ్యటం మీ సంస్కారం. కానీ అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రికని మంటలలో మండిచకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడా క్షమించరు అని ఆర్జీవీ(Ramgopal varma) ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అయినా ఆ గడ్డికి పద్మ కూడా ఎక్కువే.. అలాంటప్పుడు పద్మశ్రీని ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించారు.

హే గరికపాటి, బుల్లిబుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో.. అంతే కానీ పబ్లిసిటీ కోసం ఫిల్మ్‌ ఇండస్ట్రీ మీద మెురగొద్దు.. మెగాస్టార్‌ ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి నువ్వే తెలుసుకో అంటూ ఫైర్‌ అయ్యారు. మెగాస్టార్‌ని అవమానించన గుర్రంపాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించినవాడు మాకు గ(డ్డిప)రకతో సమానం.. తగ్గేదేలే.. అంటూ ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశారు.

Read also: Driver Dastagiri: ఏమన్నా జరిగితే జగన్‌దే బాధ్యత

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...