ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారి కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవటం ఇప్పుడు తరుచుగా వింటూనే ఉన్నాం. ఎంతో సవ్యంగా సాగుతున్న సంసారంలో ఈ అక్రమ సంబంధాలు పెద్ద చిచ్చునే రేపుతున్నాయి. ఈ ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకోవటానికి, అక్రమ సంబంధాల వైపు ఆకర్షితులు కావటానికి ఎన్నో కారణాలు ఉన్నాయట. ఇష్టపడి వివాహబంధంలోకి అడుగుపెట్టిన తరువాత.. భాగస్వాములు ఇద్దరూ కొన్ని రోజులు అన్యోన్యంగా ఉన్నా క్రమేణా ఇద్దరిలో ఎవరో ఒకరికి ప్రేమ తగ్గటంతో ఈ అక్రమ సంబంధాలకు బీజం పడుతుందట. క్రమేణా ఆఫీసులో పని చేసే వారితో చనువుగా మెలగటం ప్రారంభం అయ్యి.. అది కాస్తా లైంగిక దగ్గర అయ్యే అవకాశం ఉంది. లైఫ్ పార్టనర్‌తో విభేధాలు ఉన్నప్పుడు, వారి నుంచి దూరంగా ఉన్నప్పుడు తమతో పని చేసే వారితో సంబంధం పెట్టుకునే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. వేరే వ్యక్తులతో ప్రేమలో పడటం, మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోవటం, మరో వ్యక్తిపై ఆకర్షణ ఏర్పడటం వంటి లక్షణాలు మీరు ఇల్లీగల్ రిలేషన్‌లో ఉన్నట్లు తెలుపుతాయట.
ప్రేమ గురించి నిరంతరం వెతికే వాళ్లు, ప్రస్తుతం ఉన్న వైవాహిక జీవతంతో సంతృప్తిగా లేని వారు, భాగస్వామి వద్ద ప్రేమ లేదని భావించేవారే ఇటువంటి ఎఫైర్స్‌ను కొనసాగిస్తారట. మరికొందరైతే లైఫ్ పార్టనర్‌తో సెక్స్ జీవితం ఆశాజనకంగా లేని వారు, లైంగిక అవసరాల కోసం అక్రమ సంబంధాలను వెతుకుతుంటారట. ఇటువంటి వ్యక్తులు ఎప్పటికీ సంతృప్తి చెందలేరనీ, ఇటువంటి వారిని పెళ్లి చేసుకున్నవారిని ఎప్పటికీ మోసం చేస్తూనే ఉంటారని నిపుణులు తెలిపారు. కొంతమంది పార్టనర్‌పై రివెంజ్ తీసుకోవటం కోసం ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుంటారట. ఆ విషయం సదరు పార్టనర్‌కు తెలిసే విధంగా వ్యవహరిస్తారట. ఇంకొందరైతే మ్యారేజీని బ్రేక్ చేయటం కోసం ఎఫైర్స్ పెట్టుకుంటారట. దీనివల్ల త్వరగా వివాహ బంధం నుంచి విడాకులు పొందే అవకాశం ఉంటుందని వారి భావిస్తారట.