ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో దేశం మెుత్తం తిరిగి చూసే విధంగా గుర్తింపు తెచ్చుకున్న సమంత మరో పాన్ ఇండియా వెబ్ సిరీస్‌లో నటించనుంది. సిటాడెల్ ఇండియా పేరిట తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో సమంత నటించనుంది. ఇందుకోసం హిందీ భాషలోని యాస కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటుందట. ఈ సిరీస్ 1990 బ్యాక్‌డ్రాప్‌లో జరగనుందనీ.. నవంబర్ తొలివారంలో వర్క్ షాప్ నిర్వహించేందుకు సన్నహాలు చేస్తోందని సమాచారం. ఈ సిరీస్ వివిధ దేశాల్లో, వివిధ భాషల్లో రూపొందించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మాతృకలో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మేడెన్ నటిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్ హిట్ అయితే, సమంత కెరీర్‌కు మరింత సాయం అవుతుందని విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలతో విదేశాల్లో చికిత్స తీసుకుంటుందని పుకార్లు వస్తున్నా.. సమంత ఆ వార్తలపై స్పందించలేదు. యాక్టింగ్‌లో మరింత గ్రిప్ సాధించటం కోసమే విదేశాలకు వెళ్లినట్లు ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో సమంత స్పందిస్తే తప్పా.. ఆమె విదేశాలకు ఎందుకు వెళ్లిందనేది క్లారిటీ వచ్చేలా లేదు.