Sids farm: హైదరాబాద్ లో స్టోర్, ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన సిద్స్‌ ఫార్మ్‌

-

Sids farm starts D2C Dairy first store and experience center in Hyderabad: ప్రీమియం డీ2సీ డెయిరీ(D2C dairy) బ్రాండ్‌ కావడంతో పాటుగా తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న సిద్స్‌ ఫార్మ్‌(Sids Farm) నేడు తమ మొట్టమొదటి స్టోర్‌, ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని డీఆర్‌డీఓలో అడిషినల్‌ చీఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీర్‌ శ్రీ షేక్‌ గౌస్‌ మోహిద్దీన్‌ సమక్షంలో దీనిని ప్రారంభించారు. ఈ లీనమయ్యే, వాణిజ్య కేంద్రం వినియోగదారులకు కొనుగోలు అవకాశాలను అందించడంతో పాటుగా సిద్స్‌ ఫార్మ్‌ యొక్క అత్యున్నత నాణ్యత, ఆరోగ్యవంతమైన, స్వచ్ఛమైన ఉత్పత్తులను స్టోర్‌లో ఆస్వాదించవచ్చు. కంచన్‌భాగ్‌లోని డీఆర్‌డీఓ టౌన్‌షిప్‌ లోపల ఉన్న ఈ స్టోర్‌ ద్వారా టౌన్‌షిప్‌లోని 2వేల మంది నివాసితులు ప్రయోజనం పొందగలరు.

- Advertisement -

ఈ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రంలో వైవిధ్యమైన అంశమేమిటంటే, ఇక్కడ ప్యాకేజ్‌తో పాటుగా ప్యాకేజ్‌ చేయని ఉత్పత్తులు కూడా లభిస్తాయి. ఈ కేంద్రం ద్వారా బల్క్‌ డిమాండ్‌ అవసరాలను సైతం తీర్చనున్నారు.

ఈ నూతన కేంద్రం తెరువడం గురించి సిద్స్‌ ఫార్మ్‌ షౌండర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘మేము దాదాపు 15వేల మందికి పైగా వినియోగదారులకు ప్రతి రోజూ వారి ఇంటి ముంగిట తగిన సేవలను అందిస్తున్నాము. మా వినియోగదారులను మా ఫార్మ్‌, ప్లాంట్‌, లేబరేటరీలను శనివారాలు సందర్శించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. తద్వారా స్వచ్ఛమైన, యాంటీబయాటిక్స్‌, హార్మోన్లు, నిల్వకారకాలు లేని పాలు, పాల ఉత్పత్తులను అందించడంలో మా ప్రయత్నాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నాము. మాకు తగిన అవకాశాన్ని అందించిన రక్షణ మంత్రిత్వ శాఖ, డీఆర్‌డీఓ కు ధన్యవాదములు తెలుపుతున్నాము.రాబోయే రోజుల్లో నగరమంతా ఈ తరహా స్టోర్లను ఏర్పాటుచేయనున్నాం’’ అని అన్నారు.

Read Also: రాజగోపాల్ రెడ్డి ఎంతకు అమ్ముడుపోయాడో తెలుసా.. జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...