AP DSC Notification |ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 6,100 పోస్టులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) రిలీజ్ చేశారు. పరీక్షల నిర్వహణ కోసం https://apdsc.apcfss.in/ పేరుతో అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 2018 సిలబస్ ప్రకారమే పరీక్షల నిర్వహణ ఉంటుంది. జనరల్ అభ్యర్ధులకు 44 ఏళ్లు గరిష్ట వయోపరిమితి ఉండగా.. రిజర్వుడు అభ్యర్ధులకు మరో ఐదేళ్ల వెసులుబాటు కల్పించారు.
AP DSC Schedule Details..
ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపు గడువు
ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ
మార్చి 5 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
మార్చి 15 నుంచి మార్చి 30 వరకు ఆన్ లైన్ విధానంలో పరీక్షలు
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్
పోస్టుల వివరాలు..
ఎస్జీటీల సంఖ్య: 2,280
స్కూల్ అసిస్టెంట్లు: 2,299
టీజీటీలు: 1,264
పీజీటీలు: 215
ప్రిన్సిపాల్స్: 42
మొత్తం పోస్టులు: 6,100
జిల్లాల వారీగా ఖాళీలు..
శ్రీకాకుళం: 283
విజయనగరం: 284
విశాఖపట్నం: 329
తూర్పు గోదావరి: 392
పశ్చిమ గోదావరి: 306
కృష్ణా: 279
గుంటూరు: 416
ప్రకాశం: 503
నెల్లూరు: 346
చిత్తూరు: 336
కడప: 386
కర్నూలు: 1693