TS EAMCET |టీఎస్ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. మే 7వ తేదీ నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 10, 11 తేదీల్లో నిర్వహించాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష యథాతథంగా జరగనుంది. నీట్, టీఎస్‌పీఎస్సీ పరీక్షల కారణంగా ఎంసెట్ ఇంజినీరింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4వ తేదీతో ముగియనుంది.
- Advertisement -
Read Also: TSPSC ప్రశ్రాపత్రాల లీకేజీ కేసులో సిట్ దూకుడు
Follow us on: Google News, Koo, Twitter