NTPC: 864 ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు ఖాళీ

-

న్యూఢిల్లీలోని ఎన్‌టీపీసీ(NTPC) లిమిటెడ్‌ ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ 2022 ఖాళీల భర్తీకి అర్హులైన గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్ల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతోంది. మెుత్తం 864 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు ఖాళీ ఉన్నట్లు ప్రకటించింది. కాగా, వీటిల్లో ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్స్ట్రుమెంటేషన్‌, సివిల్‌, మైనింగ్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు వెల్లడించింది. కనీసం 65 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ( ఇంజనీరింగ్‌\ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు గేట్‌- 2022కి హాజరయ్యి ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే అర్హత ఉన్నట్లేనని తెలిపింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 మించరాదని వెల్లడించింది. అక్టోబర్‌ 28-2022 నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవటానికి అనుమతి ఇవ్వనుండగా, చివరి తేదీ నవంబర్‌ 11-2022 అని ఎన్‌టీపీసీ(NTPC) అధికారులు వివరించారు. మరిన్ని వివరాల కోసం https://careers.ntpc.co.in ఈ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

- Advertisement -

Read also: వాటిల్లో జియోదే అగ్రస్థానం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...