నిరుద్యోగులకు శుభవార్త.. 12వేలకు పైగా పోస్టులు

-

India Post Office |నిరుద్యోగులకు తపాలా శాఖ శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో మెరిట్‌ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టనుంది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్(ABPM) హోదాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు మే 22 నుంచి జూన్‌ 11లోపు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -

India Post Office |ఏపీలో 118, తెలంగాణలో 96 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల వయసు జూన్‌ 11, 2023 నాటికి 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంది. BPM పోస్టులకు నెలకు వేతనం రూ.12,000-రూ.29,380.. ABPM పోస్టులకు రూ.10,000-రూ.24,470 చొప్పున చెల్లిస్తారు.

Read Also: వేసవిలో ఈ ఫుడ్స్ రోజువారీ డైట్ లో చేరిస్తే మంచి బెనిఫిట్స్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...